mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గేమింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ బాక్స్ లో మరోసారి లే ఆఫ్ లు

11 జూన్, 2026

Xbox to lay off more employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 11:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ గేమింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ బాక్స్ మరోసారి లే ఆఫ్ లకు సిద్ధమైంది. జూన్ నెలాఖరు నాటికి ఉద్యోగ కోతలు ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆశావర్మ ఎక్స్ బాక్స్ సిఇఒగా బాధ్యతలను చేపట్టినప్పటి నుండి.. అన్ని విభాగాల్లోనూ సమూల మార్పులపు చేపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 100 రోజుల ఎక్స్ బాక్స్ రీసెట్ కు ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఉద్యోగ కోతలు చేపట్టనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 12 నెలల్లో ఎక్స్ బాక్స్ రెండవ విడత ఉద్యోగ కోతలు చేపట్టడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్