test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు’

22 మే, 2026

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 01:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్: తన కుమారుడు వివాహానికి హాజరుకాకపోవచ్చని సంకేతాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఇరాన్‌కు సంబంధించిన కీలక అంశాలతో ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు నివేదికలు వెల్లడించాయి. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహంపై విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అతను నేను పెళ్లికి రావాలని కోరుకుంటున్నాడు. కానీ నాకు సమయం లేదు. ప్రస్తుతం ఇరాన్‌కు సంబంధించిన ఒక పెద్ద విషయం ఉంది. నేను పెళ్లికి హాజరైతే నన్ను చంపేస్తారు. హాజరు కాకపోయినా నన్ను చంపేస్తారు. ఎలాగైనా తప్పుడు వార్తలే వస్తాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తాను పెళ్లికి వెళ్తే మీడియా దానిని ఎలా చూపిస్తుందో తనకు తెలుసని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆయన మీడియాను ఎగతాళి చేశారని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇరాన్ యుద్ధ పరిస్థితులు వైట్‌హౌస్‌పై ఎంత ఒత్తిడి తెచ్చాయో ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని అంటున్నారు. 48 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం ఈ వారాంతంలో జరగనున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్