test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడవసారి వడ్డీ రేట్లు యథాతథం

3 రోజుల క్రితం

RBI keeps repo rate unchanged
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : వరుసగా మూడవసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రెపోరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేట్లలో ఎటువంటి మార్పు లేదని, 5.25శాతం వద్ద యథాతథంగా ఉంచి తటస్థ ద్రవ్య విధాన వైఖరిని కొనసాగిస్తున్నట్లు ఆర్బిఐ పేర్కొంది. కీలక వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది మూడవసారి. ద్రవ్యవిధాన కమిటీ సమావేశ వివరాలను ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి దశను కేంద్రం సమర్థవంతంగా అధిగమించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి సంక్షోభ సమయాలతో పోలిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ప్రపంచ సంక్షోభ దశలోకి బలమైన పునాదులతో ప్రవేశించిందని, ఈ ఓడిదుడుకులను కనీస నష్టంతో ఎదుర్కోగలమన్న విశ్వాసంతో ఉన్నామని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీరేట్లను ఆర్బిఐ యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్