test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వడ్డీ రేట్లు పెరగొచ్చు..!

1 రోజు క్రితం

inflation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 01:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐసిఐసిఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ రిపోర్ట్‌

‌న్యూఢిల్లీ:  పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, దేశంలో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న రుతుపవనాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో దేశీయ ద్రవ్యోల్బణం 5 శాతానికి పెరిగే ప్రమాదం ఉందని ఐసిఐసిఐ బ్యాంక్‌ ‌గ్లోబల్‌ ‌మార్కెట్స్‌ ఓ నివేదికలో హెచ్చరించింది. ఈ ఆహార, ఇంధన ధరల ముప్పును అదుపు చేయడానికి రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బిఐ) తన కీలక వడ్డీ రేట్లను మరో 50 నుండి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని విశ్లేషించింది. గడిచిన మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ట స్థాయి అయిన 3.94 శాతానికి చేరగా.. ఇందులో ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం 4.8 శాతానికి, ఇంధన ద్రవ్యోల్బణం 1.9 శాతానికి పెరగడం ఆందోళకరం.

తీవ్రమైన ఎండల కారణంగా మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 10 నెలల గరిష్ట స్థాయి అయిన 5.7 శాతానికి చేరగా.. నెలవారీగా టమోటాలు 26 శాతం, క్యాలీఫ్లవర్ 12 శాతం ప్రియమయ్యాయి. వీటితో పాటు పప్పుధాన్యాలు, వంటనూనెలు, ఇంధన ధరలు పెరగడం, రెస్టారెంట్ సేవలు, దుస్తుల ధరలు అధికమవడం వల్ల కోర్‌ ద్రవ్యోల్బణం కూడా 2.4 శాతానికి చేరింది. సాధారణం కంటే 10 శాతం తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున మున్ముందు పంటల దిగుబడి తగ్గి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు త్వరగా ముగియకపోతే ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపు వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే దేశంలో అధిక ధరలు ప్రజల కొనుగోళు శక్తిని హరించి వేస్తున్నాయి. దీంతో అనేక ఉత్పత్తులకు డిమాండ్‌ ‌పడిపోతోంది. ఈ క్రమంలో ధరలు మరింత పెరిగితే ప్రజలు తీవ్ర అప్పుల పాలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్