జెరూసలెం : హమాస్ సాయుధ విభాగం చీఫ్ ఎజ్జెడిన్ అల్ హదద్ మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం శనివారం ప్రకటించింది. శుక్రవారం గాజా నగర ప్రాంతంలో జరిపిన వైమానిక దాడిలో ఎజ్జెడిన్ అల్ హదద్ మరణించినట్లు ఐడిఎఫ్ , ఐఎస్ ఎ (షిన్ బెట్ దేశీయ భద్రతా సంస్థ) ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై దాడికి ప్రణాళిక రచించిన హమాస్ సైనిక విభాగంలోని చివరి సీనియర్ కమాండర్లలో హదాద్ ఒకరని సైన్యం ఆరోపించింది. గాజా నగరంలోని ఒక అపార్ట్ మెంట్, పౌర వాహనంపై నిన్న ఇజ్రాయిల్ జరిపిన దాడిలో హదాద్ మరణించారని ఇద్దరు హమాస్ అధికారులు మీడియాకు తెలిపారు.
హమాస్ సాయుధ విభాగం చీఫ్ మృతి : ఇజ్రాయిల్ సైన్యం
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 06:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)