test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఖతార్ తీరంలో సరుకు రవాణా నౌకపై దాడి

10 మే, 2026

cargo ship catches fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్ :   ఖతార్ తీరంలో ఆదివారం గుర్తు తెలియని క్షిపణి దాడి కారణంగా సరుకు రవాణా నౌకలో మంటలు చెలరేగినట్లు బ్రిటీష్ సైన్యం తెలిపింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను తరలిస్తున్న నౌకపై గుర్తు తెలియని డ్రోన్ లేదా క్షిపణి దాడి జరిగిందని, దీంతో నౌకలో మంటలు చెలరేగాయని యునైటెడ్ కింగ్ డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ (యుకెఎంటిఒ)వెల్లడించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే  మంటలను ఆర్పివేసిందని యుకెఎంటిఒ పేర్కొంది. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా 23 నాటికల్ మైళ్ల (43కిలోమీటర్ల)దూరంలో ఈ దాడి జరిగిందని తెలిపింది.  ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. నౌక గురించిన పూర్తి సమాచారం తెలియలేదని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్