బీజింగ్: చైనాలో అధికారిక పర్యటన కోసం రాజధాని బీజింగ్ కు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చేరుకున్నారు. బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్ నకు ఉపాధ్యక్షులు హన్ జెంగ్ స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షులు చైనాలో పర్యటించడం సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఇదే మొదటిసారి. అధ్యక్ష హోదాలో చైనాలో పర్యటించడం 2017 నుంచి ట్రంప్ నకు ఇది రెండోసారి. చైనా అధ్యక్షులు షీ జిన్ పింగ్ ఆహ్వానం మేరకు ఈ నెల 13 నుంచి 15 తేదీ వరకూ ట్రంప్ ఈ పర్యటనలో పాల్గొంటారు. జిన్ పింగ్ తో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ శాంతి, అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ట్రంప్ చర్చించనున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
చైనా చేరుకున్న ట్రంప్
14 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 14, 2026, 05:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)