test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వేణు ఉడుగుల కొత్త సినిమా ప్రకటన

5 రోజుల క్రితం

venu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 09:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల తన కొత్త చిత్రం ‘అన్నదమ్ముల పంచాయితీ’ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య తలెత్తే విభేదాలు ఒక కుటుంబాన్నే కాకుండా ఊరి జీవితాన్నీ ప్రభావితం చేస్తాయనే అంశంతో ఈ కథ రూపొందిందని తెలిపారు. జమ్మికుంట నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటన స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు పేర్కొన్నారు. వేణు ఊడుగుల కథ అందించిన ఈ చిత్రానికి మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డోలా ముఖి ఫిలిమ్స్, ఆరాధ్య సినీ క్రియేషన్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ యాస తెలిసిన వారికి నటించే అవకాశం కల్పిస్తూ, ఆసక్తి గలవారు dsf.productiono2@gmail.com కు లేదా 8096411437 నంబర్‌కు వీడియోలు పంపాలని చిత్రబృందం కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్