Ram Charan Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జనవరి 31న కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ మధుర క్షణాలకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను ఉపాసన తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మెగా అభిమానులకు, అపోలో ఆసుపత్రి వైద్య బృందానికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో చూసిన ప్రతీసారి తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందని పేర్కొన్నారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించారనే సంగతి తెలిసిందే. జనవరి 31న ఉపాసన ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చారు. ట్విన్స్ రాకతో కొణిదెల ఫ్యామిలీలో ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి. మెగా అభిమానులు సైతం వారసుడు వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రెండోసారి తల్లి అయిన సందర్భంగా మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఓ వీడియో పంచుకున్నారు.
ఉపాసన సీమంతం, డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ డాక్టర్స్ ఏర్పాట్లు చేయడం, డెలివరీకి ముందు ఎంత టెన్షన్ పడ్డారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, కవలలు పుట్టిన తర్వాత చిరంజీవి సంతోషం వ్యక్తం చేయడం, అభిమానులు ఎలా సంబరాలు చేసుకున్నారు అనేది తెలియజేసే వీడియోని ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇది చూసినప్పుడల్లా తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందని, తమ కుటుంబంపై ప్రేమ చూపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అపోలో ఆస్పత్రి డాక్టర్స్, రామ్ చరణ్ అభిమానుల మద్దతు మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)