test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 రోజుల క్రితం

'Sarkaru Baayi' Movie First Look Poster Released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 07:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ సామాజిక నేపథ్యంలో 1985లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, కుల వివక్ష, నీటి సమస్యలు, అణగారిన వర్గాల పోరాటాల కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు బాయి’. లారా దర్శకత్వంలో, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్నారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

చరిత్రలో మరుగున పడిపోయిన ఒక హృదయ విదారక గాథను, సామాజిక బాధ్యతతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ కథ విన్నప్పుడే జాతీయ అవార్డు స్థాయి చిత్రమవుతుందనే నమ్మకం కలిగిందని హీరోయిన్ వర్షిక తెలపగా, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్