test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్టిఆర్ ఇంట్లో కొత్త అతిథులు – పోస్ట్ వైరల్ ..!

20 మే, 2026

New guests in NTR's house - Post goes viral..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్‌తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్‌ తన బర్త్‌డే (మే 20) సందర్భంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. ఇవి జపనీస్‌ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్‌ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్‌ పేర్లు పెట్టినట్లు తారక్ వెల్లడించారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్