test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్పిరిట్ లో నదియా

5 రోజుల క్రితం

nadiya.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 10:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘క్రిష్’ ఫేమ్ వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ‘స్పిరిట్’లో నటి నదియా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఆమె షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్, నదియా కాంబోలో ఇప్పటికే ‘మిర్చి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ తల్లి పాత్రలో నదియా నటించగా, తల్లీకొడుకులుగా ప్రభాస్, నదియా కాంబోకు మంచి క్రేజ్ ఏర్పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్