రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘ఇరుముడి’ చిత్రం నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను మేళవించినట్లు తెలుస్తోంది. రవితేజ, బేబి నక్షత్రల మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బాండింగ్‌ను ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Print Edition‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)