test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయూట్యూబ్‌లోకి ‘అరేయ్ ఆపండ్రా’

5 రోజుల క్రితం

Arey Apandra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 09:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ బ్యానర్‌పై అశోక్ నిమ్మల నిర్మాణంలో, తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అరేయ్ ఆపండ్రా’. సుదర్శన్, భద్రం, సాయికృష్ణ తల్లాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మే 15న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్లలో పర్వాలేదనిపించిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే అంశంపై దర్శకుడు తల్లాడ సాయికృష్ణ స్పందిస్తూ, “త్వరలో ఒక ఓటీటీలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అందుకోసం ఇంకా సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో ప్రేక్షకులకు వినోదం అందించాలని టాలీవుడ్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు ఉచితంగా అందిస్తున్నాం” అని తెలిపారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. వెంకటేష్ సంగీతం అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్