అమరావతి : ‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు..’ అంటున్నాడు రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. వెంకట సతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మాతలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 4 న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సహా ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ముంబయిలో ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం యూట్యూబ్లో ట్రైలర్ ను రిలీజ్ చేసింది. వాస్తవానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆ అంచనాలు మరింత పెంచేలా ప్రమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 4 వ తేదీన రిలీజ్ కాబోతోంది. జూన్ మూడు సాయంత్రం ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
TRAILER – పెద్ది ట్రైలర్ రిలీజ్ ..!
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)