నందమూరి కుటుంబం నుంచి హీరోగా వచ్చి రాణిస్తున్న వారిలో కళ్యాణ్‌రామ్ ఒకరు. అయితే మిగతా వారితో పోలిస్తే ఆయనలో ఓ ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది. అదే న్యూ టాలెంట్‌ని ప్రోత్సహించడం. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆయన ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఎంచుకోవడం, కొత్త దర్శకులను నమ్మి పెద్ద అవకాశాలు ఇవ్వడం కళ్యాణ్ రామ్ ప్రత్యేకతగా మారింది. ఆయన పరిచయం చేసిన దర్శకుల్లో కొందరు అగ్రస్థానానికి చేరుకున్నారు. ముఖ్యంగా ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా గుర్తింపు పొందారు. రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు పని చేసిన అనంతరం దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడిని కళ్యాణ్ రామ్ నమ్మి అవకాశం ఇవ్వడం అప్పట్లో పెద్ద రిస్క్‌గా భావించారు. అయితే ఆ నిర్ణయం సూపర్ హిట్‌గా మారింది. అలాగే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Print Editionన్యూ టాలెంట్‌కి కల్యాణ్‌రామ్ సపోర్ట్... డైరెక్టర్‌గా మారుతోన్న మరో స్టార్ రైటర్!
13 ఫిబ్రవరి, 2026

Nandamuri kalyan Ram next movie(ఫోటోలు- Samayam Telugu)
Reporter 1
ప్రచురించబడింది ఫిబ్ర 13, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)