వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరో నితిన్, తన తదుపరి చిత్రాల విషయంలో రూటు మార్చారు. తన 36వ చిత్రాన్ని దర్శకుడు వీఐ ఆనంద్‌తో చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమాని ఇటీవలే అనౌన్స్ చేశారు. అయితే దీంతో పాటుగా ‘ఆయ్’ సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అంజి చెప్పిన కథకు కూడా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.
టాలీవుడ్ హీరో నితిన్ చాలాకాలంగా సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. 'భీష్మ' తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గడిచిన ఐదేళ్లలో ఏడు సినిమాలు చేస్తే.. వేటికవే బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేశాయి. గతేడాది వచ్చిన 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' సినిమాలపై నితిన్ తో పాటుగా ఆయన అభిమానులు కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు, కానీ రెండూ డిజాస్టర్లుగా మారాయి. దీంతో ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నితిన్ బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలకు కమిట్ అయ్యారు.







కామెంట్‌లు (0)