బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌కు పెద్ద ఉపశమనం లభించింది. ఆయనపై విధించిన నాన్-కోఆపరేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) బుధవారం ప్రకటించింది. ఫర్హాన్ అక్తర్ సినిమా ‘డాన్ 3’ నుంచి రణవీర్ తప్పుకోవడంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రణవీర్ సింగ్ సదరు సంస్థకు లీగల్ నోటీసు పంపిన కొద్ది గంటల్లోనే FWICE ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPAA), ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) జోక్యంతో సమస్య సర్దుమణిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ మాట్లాడుతూ, ‘సినీ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు రణవీర్ సింగ్‌పై ఉన్న నాన్-కోఆపరేషన్ ఆదేశాలను రద్దు చేస్తున్నాం. నిర్మాతలు, దర్శకులు లేదా నటులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం’ అని చెప్పారు. FWICE విధించిన ఈ నిషేధంపై రణవీర్ సింగ్ మంగళవారమే లీగల్ నోటీసు పంపారు.
రణవీర్‌పై FWICE నిషేధం ఎత్తివేత
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)