test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రామచిలుక పెళ్లి

27 మే, 2026

rama chiluka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రావమ్మా రావమ్మా ఓ రామ చిలుక
రయ్యంటూ రావమ్మా రతనాల మొలక

రాజమండ్రి వెళ్లి నీకు రవ్వల హారమే కొన్నాను
రాజంపేట కెళ్ళి నీకు వడ్డాణమే తెచ్చాను
చార్మినార్ వెళ్లి నీకు మట్టి గాజులే కొన్నాను
చెన్నై వెళ్లి నీకు గోళ్ళ రంగులే తెచ్చాను

లాలాగూడ కెళ్ళి నీకు లిప్ స్టిక్ కొన్నాను
ముత్తుకూరు కెళ్ళి నీకు ముత్యాలే తెచ్చాను
మహారాష్ట్ర కెళ్ళి నీకు ముక్కుపుడకనే కొన్నాను
దొనకొండ వెళ్లి నీకు దొండ కాయలే తెచ్చాను

ఉలవపాడు కెళ్ళి నీకు మామిడి పండ్లే కొన్నాను
జనగామ కెళ్ళి నీకు జామ పండ్లే తెచ్చాను
కాకినాడ కెళ్ళి నీకు కళ్ల కాటుకే కొన్నాను
కంచికి పోయి నీకు పట్టుచీరలే తెచ్చాను

గోదావరి కెళ్ళి నీ గోరింకనే చూశాను
కోనసీమ పందిరిలో… కోకిలమ్మ సందడిలో…
కమనీయంగా మీకు కళ్యాణమే జరిపిస్తాను
అందాల పాపికొండలే హాయిగా చూపిస్తాను!

​- గుండాల నరేంద్రబాబు,
94932 35992.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్