test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమ్మా! ఇక విసిగించను!

05 జూన్, 2026

mother
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమ్మా! నోరూరుతోంది
ఆకలి దంచేస్తున్నది

ఇంత గిన్నె సాంబారును
ఇడ్లీలకు జతగ పెట్టు
ఉప్మా పెసరట్టు కలుపు
ఉల్లిపాయ మరువవద్దు
ఒక్క దిబ్బరొట్టె పెట్టు
ఒక్క ముక్క మిగలదొట్టు

పిజ్జాలూ, బర్గర్లను
పిల్లలంత మానాలని
పానీపూరీ, చిప్సూ
పాడుచేయు దేహాన్నని
బడిలోపల నేర్పారు
బయట తిండి మానాలని

అమ్మ చేతి వంటంటే
అమృత సమము, అద్భుతమని
ఇంటి వంట తింటుంటే
ఇబ్బందులు పడబోమని
అమ్మా! ఇక విసిగించను
అలిగి తిండి మానేయను

హమ్మయ్యా! నవ్వావా?
హాయిగ నను చూశావా?
ఆకుకూర, కాయగూర
ఏదైనా తింటానిక
ఫలాలనూ గింజలనూ
పారేయక నే తింటా.
​- గుడిపూడి రాధికా రాణి, 94949 42583.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్