test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొంటె పిల్ల ‘ఉమ`

24 మే, 2026

chinnari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 10:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​కొంటె పిల్ల ‘ఉమ`
అంటే భయమే!
కోతి చేష్టలే
కొంచెం నయమే!!
కోరినా వెనుక
కూర్చుంటుందీ!
గుండు సూదితో
గుచ్చు తుంటదీ!!
మాట వున్నదీ
చాటుకు రమ్మని
మాయబుచ్చినా
తాయం తింటది!!
చెప్పెద అమ్మకు
ఇప్పడె అంటే
‘‘చెప్పకొ చెప్పకొ
చెప్పతొ కొట్టుకొ’’
అంటూ నన్నూ
ఆట పట్టించు!
ఏదో విధముగ
ఎపుడేడిపించు!!
టీచరు గారినె
టీజ్ చేస్తుందీ!
బడి కెళ్లుటకూ
భయమేస్తోందీ!!
అంటివుండకా
కొంటె తన మిలా!
పెరిగిన కొద్దీ
తరిగిదరిమిలా!!

​-`బాల బంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత )
9440805001​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్