test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅత్యంత అధ్వానస్థితిలోకి రూపాయి

15 మే, 2026

rupee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 01:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌‌లో రూపాయి విలువ అత్యంత అధ్వానస్థితిలోకి జారుకుంది. చర్రితలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోడీ హయాంలో ఆల్‌‌టైం కనిష్ట స్థాయికి పడిపోయింది. ముడి చమురు ధరలు నిరంతరం పెరగడం, ద్రవ్యోల్బణ ఆందోళనలు, వాణిజ్యలోటు పెరగడం, విదేశీ మారకం నిల్వలు తగ్గడం, ఎఫ్‌‌డిఐలు పడిపోవడం తదితర కారణాలతో శుక్రవారం ఇంట్రాడేలో డాలర్‌‌తో పోల్చితే రూపాయి ఏకంగా 96.14 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బిఐ) జోక్యంతో కొంత కోలుకుని చివరికి 30 పైసలు నష్టపోయి 95.94కు పరిమితమైంది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి విలువ దాదాపు 2 శాతం మేర క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మొత్తం 6 శాతానికి పైగా నష్టపోయింది. వారాంతం సెషన్‌‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 46.10 పాయింట్లు ‌తగ్గి 23,643.50 వద్ద నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్