test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ద్రవ్యోల్బణం @7.8%

3 గంటల క్రితం

inflation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆహార పదార్థాల ధరలు, ఇంటి వ్యయం, సేవల ఖర్చు కారణం
- తాజా సర్వేలో రిజర్వ్ బ్యాంకు వెల్లడి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పశ్చిమాసియాలో యుద్ధం.. దేశ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందా... అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో గత కొద్దికాలంగా ద్రవ్యోల్బణం పెరుగు తున్నట్టు తేలింది. కేవలం రెండు నెలల్లోనే 0.6 శాతం పెరిగినట్టు ఆర్‌‌బిఐ వెల్లడించించింది. వివిధ వర్గాల నుంచి సేకరించిన ప్రజాభిప్రాయ వివరాల్లో ఈ పెరు గుదల కనిపించింది. ధరలు, ఇళ్ల వినియోగం, సేవలు, వంటి రంగాల్లో ఈ వివరాలు సేకరించారు. ఈ ఏడాది మార్చిలో 7.2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రెండు నెలల్లోనే అంటే మే నెలకు 7.8 శాతంగా రికార్డయింది. ఇందుకుగల కారణాలను కూడా రిజర్వ్ బ్యాంకు విశ్లేషించింది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో 5,936 మంది నుంచి అభిప్రాయం సేకరించారు. 2025 సెప్టెంబరులో 7.4 శాతం ద్రవ్యోల్బణం నమోదవగా, ఈ ఏడాది మే నెలలో 7.8 శాతానికి పెరగడం గమనార్హం. అన్ని రకాల ధరలపై ఈ ప్రభావం ఉంటుందని జనం భావిస్తున్నారు. మొత్తం 83.4 శాతం మంది ఇలా ధరల పెరుగుదల ఉంటుందని చెప్పారు.

​​ఆహారంపై ప్రభావం
​ద్రవ్యోల్బణం వల్ల ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఏకంగా 85.4 శాతం మంది పెరుగుదల తప్పదన్న భావాన్ని వ్యక్తం చేయగా.. ఇప్పుడున్న ధరలకంటే ఇంకా పెరుగుతాయని మరో 60.7 శాతం మంది పేర్కొన్నారు. ఆహారేతర ఉత్పత్తుల ధరలు కూడా భారీగానే పెరుగుతాయని 81.1 శాతం మంది భావిస్తున్నారు. 56.8 శాతం మంది ప్రస్తుత ధరలకన్నా ఎక్కువగా పెరుగుతాయని చెప్పారు.

గృహ వస్తువుల ధరలూ పైపైకి..
ద్రవ్యోల్బణ ప్రభావం గృహ పరికరాలపైనా పడుతుందని 68.2 శాతం మంది అభిప్రాయపడ్డా రు. దీనివల్ల గృహ వ్యయం కూడా పెరుగుతుందని 78.3 శాతం మంది భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్