test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చార్మినార్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

21 మే, 2026

fire accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 21, 2026, 11:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది

హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని మదీనా చౌరస్తా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రాంతమంతా భయాందోళనకు గురైంది. ప్రమాద తీవ్రతకు భారీ అగ్నికీలలు, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేశాయి. దుకాణంలో పెద్ద మొత్తంలో వస్త్ర నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది పలువురు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం కారణంగా సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్