DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

17 జూన్, 2026

Students' protest at Bapatla Engineering College
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బాపట్ల : కొత్త టైమింగ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ …. బుధవారం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సమయం వద్దు అని విద్యార్థులు కోరుతున్నారు. పాత విధానమైన ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు సమయాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కళాశాల ప్రధాన గేట్ వద్ద ధర్నా, ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల నినాదాలతో కళాశాల పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కళాశాల యాజమాన్యం స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. టైమింగ్స్ మార్పుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్