వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. హెచ్1బీ వీసాల కోసం ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (సుమారు రూ. 85 లక్షలకు పైగా) భారీ ఫీజును అమెరికా ఫెడరల్ న్యాయస్థానం కొట్టేసింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని బోస్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరొకిన్ సోమవారం తీర్పు వెలువరించారు. విదేశాల్లో ఉంటూ అమెరికా తాత్కాలిక వలస వీసా (హెచ్1బీ)కి ఎంపికైన వారు ఈ భారీ మొత్తాన్ని చెల్లించాలని గత సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం నిబంధన తీసుకురాగా.. దీనిని సవాలు చేస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన జడ్జి, అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం లేకుండా అధ్యక్షుడు నేరుగా ఇలాంటి పన్నులపై నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేశారు. ఈ భారీ వసూలు పెనాల్టీ కాదని, చట్ట విరుద్ధమైన పన్ను అని ప్రకటిస్తూ ఆ నిబంధన చెల్లదని కొట్టిపారేశారు. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో ఐటీ సహా పలు రంగాలకు చెందిన వేలాది మంది విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు పెద్ద ఊరట లభించింది.
ట్రంప్‌కు షాక్: హెచ్1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు కొట్టేసిన అమెరికా కోర్టు
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 07:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)