test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం

30 మే, 2026

CITU's 56th Foundation Day Celebrated Grandly
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 04:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ (బీసెంట్ రోడ్డు) : విజయవాడ హాకర్స్, తోపుడబండ్లు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ బీసెంట్ రోడ్డులో శనివారం రామాలయం సెంటర్ లో సిఐటియు జెండాను ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి. హెచ్. శ్రీనివాస్ ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. సి. హెచ్. శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ సిటి ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు మాట్లాడుతూ …. ప్రతి సంవత్సరం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నప్పటికీ మన ముందు ఉన్న కర్తవ్యం కార్మిక సంఘం ఐక్యతకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సిఐటియు 1970లో ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. అతి కొద్ది మందితో ఏర్పడిన సిఐటియు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో విస్తరించి కార్మికులు సమస్యల పైన కార్మికులు ఆర్థిక సమస్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. కార్మిక చట్టాలని, పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ సెలవులు, గ్రాడ్యుటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హక్కులుకై సుదీర్ఘ పోరాటాలు చేస్తూ అన్ని రంగాల్లో విస్తరించిందన్నారు. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు ఇండిస్టీ కార్మికులు, ఉద్యోగ కార్మికులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పైన అలుపు ఎరగని పోరాటాలు చేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా కార్మిక సంఘాలును ఐక్యపరుస్తూ దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మిక సమస్యలు పరిష్కారం కోసం,హక్కులు కాపాడుకోవడం కోసం కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరియు విజయవాడ నగరంలో ఉన్న హాకర్స్ కు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారిపై పోలీసు మున్సిపల్ అధికారులు వేధింపులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా సిఐటియు కార్మికులందరినీ కలుపుకొని పోరాడుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు, నగర కార్యదర్శి ఎం. సోమేశ్వరరావు, విజయవాడ హాకర్స్ మరియు తోపుడు బండ్లు యూనియన్ నగర అధ్యక్షులు భూలోకం, కార్యదర్శి సి. హెచ్. మురళి, యూనియన్ కోశాధికారి ఉదయకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. లక్ష్మణ్, నగర ఉపాధ్యక్షులు సాంబిరెడ్డి, సూరమ్మ,మస్తాన్, ఆల్తాఫ్, లక్ష్మీ, శ్రీను, రాము,బేవర. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్